నటనారంగంలో శిక్షణ అందిస్తూ పలువురు నటీనటులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న వినోద్ ఫిల్మ్ అకాడమీ యాక్టింగ్ స్కూల్ మరో విశిష్ట గౌరవాన్ని అందుకుంది. ‘కోడి రామకృష్ణ అవార్డ్స్ 2026’లో బెస్ట్ యాక్టింగ్ స్కూల్ ఇన్ హైదరాబాద్ పురస్కారానికి ఎంపికైంది.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, నటుడు సుమన్, నిర్మాతలు అంబికా కృష్ణ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ చేతులమీదుగా సంస్థ పౌండర్ వినోద్ నువ్వుల ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందని, భవిష్యత్తులో మరింత మంది ఉత్తమ నటీనటులను సినిమా ఇండస్ట్రీకి అందించడమే తమ అకాడమీ ప్రధాన లక్ష్యం అని వినోద్ నువ్వుల చెప్పారు.
