డీఎస్సీ 2003 టీచర్లకు ఓపీఎస్ అమలు చేయాలి
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి టీచర్ల వినతి
హైదరాబాద్, వెలుగు : ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ2003 టీచర్లకు, ఉద్యోగులకు పాత పింఛన్ అమలు చేయాలనీ పాత పింఛన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్ కోరారు. ఆదివారం హైదరాబాద్లో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీకి పోరాట సమితి నేతలు వినతిపత్రం అందించారు. 2004 సెప్టెంబర్1లోపు ఉద్యోగ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు రిలీజ్ చేసినవారికి పాతపింఛన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం మెమో జారీచేసిందని గుర్తుచేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఓపీఎస్ విధానాన్ని అమలుచేస్తున్నా తెలంగాణలో అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒవైసీని కలిసినవారిలో పోరాట సమితి నేతలు వేణుగోపాల్, కిషన్, అంబెల్లి శంకర్, రాజేందర్ రెడ్డి, నాగలక్ష్మి, ఇష్రత్ పర్వీన్ తదితరులు ఉన్నారు.
