Ajith Kumar: GT4 రేసింగ్‌లో హీరో అజిత్ కారుకు ప్రమాదం.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

 Ajith Kumar: GT4 రేసింగ్‌లో హీరో అజిత్ కారుకు ప్రమాదం.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

 కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్(  Ajith kumar ) కు కార్ రేసింగ్ పై ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు.  ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రేసింగ్ లోనూ రాణిస్తున్నారు. 2003 లో రేసింగ్ రంగంలో అజిత్ ప్రవేశించారు. తరువాత గణనీయమైన పురోగతిని సాధించారు. ముఖ్యంగా 2010 లో ఫార్ములా 2 ఛాంపియన్ ఫిప్ లో పాల్గొన్నాడు. దాదాపు దశాబ్దానికి పైగా రేసింగ్ నుంచి విరామం తీసుకున్న అజిత్ మళ్లీ పూర్తి ఉత్సాహంతో తిరిగి వచ్చారు.  తన నటజీవితాన్ని, రేసింగ్ పట్ల అభిరుచిని బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్తున్నారు.

అయితే ఇటలీలో జరుగుతున్న  జీటీ4 యూరోపియన్ సిరీస్ (GT4 European Series )  లో అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది.  అదృష్టవశాత్తు అజిత్ కు ఎలాంటి గాయాలు కాలేదు.  GT4 యూరోపియన్ సిరీస్ రెండో రౌండ్ కొనసాగున్న సమయంలో మిసానో ట్రాక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అజిత్ వాహనం ట్రాక్ పై ఆగి ఉన్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరడంతో అజిత్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.  కానీ విరామం తీసుకొని రేస్ ట్రాక్ లోని శిథిలాలను శుభ్రం చేయడానికి గ్రౌండ్ సిబ్బందికి సహాయం చేస్తూ కన్పించారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేసింగ్ ట్రాక్‌పై తన తోటివారి పట్ల చూపిన అజిత్ కుమార్  చూపిన మానవత్వంపై ప్రశంసలు అందుకుంటున్నారు. 

ALSO READ : Coldplay concert : కోల్డ్‌ప్లే కచేరీ క్లిప్ వైరల్.. అదిరిపోయే మీమ్‌తో 'బాహుబలి' టీమ్ ఎంట్రీ!

 

బెల్జియంలోని స్పా-ఫ్రాంకోర్చాంప్స్ సర్క్యూట్లో అజిత్ మూడో రౌండ్ కు సన్నద్ధమవుతున్నాడు. అజిత్ తన వినయాన్ని ప్రదర్శిస్తూ, ప్రమాదం జరిగిన ప్రదేశంలో క్లీనింగ్ సిబ్బందికి సహాయం చేస్తూ కనిపించాడు. దీంతో అజిత్ సాయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  అజిత్ కుమార్ కారు నుంచి బయటకు వచ్చాడు. ఈ ఏడాది అతని నుంచి మనం చూసిన తొలి గణనీయమైన నష్టం ఇది. అతను మంచి ఛాంపియన్, అతను వెళ్లి మార్షల్స్ శరీరమంతా క్లియర్ చేయడానికి సహాయం చేస్తాడు. చాలా మంది డ్రైవర్లు అలా చేయరు అని సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు.

ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంలో నటించారు. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ నటుడు సినిమాలకు విరామం తీసుకుంటున్నాడు. తన తదుపరి చిత్రాన్ని కూడా ఆదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల అజిత్ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఈ ప్రశంస ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలికి, రెండు రంగాల పట్ల అంకితభావానికి నిదర్శనం. దశాబ్దానికి పైగా రేసింగ్ నుంచి విరామం తీసుకున్న అతను ఇటీవల పూర్తి ఉత్సాహంతో తిరిగి వచ్చాడు..