సామి సామి సాంగ్ కు డ్యాన్స్ తో అదరగొట్టిన స్కూల్ విద్యార్థిని

సామి సామి సాంగ్ కు డ్యాన్స్ తో  అదరగొట్టిన స్కూల్ విద్యార్థిని

పుష్ప ..ఈ మూవీ ఒక సెన్సేషన్.  దేశంలో పలు భాషల్లో రిలీజైన ఈ చిత్రం కలెక్షన్ల  వర్షం కురిపించింది.  అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా వివిధ లాంగ్వేజ్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  ఈ  సినిమాలోని సాంగ్స్  జనాలను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా సామి సామి సాంగ్..వరల్డ్ వైడ్గా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దేశ విదేశాల్లోని ఎంతో మంది అభిమానులు ఈ సాంగ్పై రీల్స్ చేసి ఆకట్టుకున్నారు. కవర్ సాంగ్లతో అదుర్స్ అనిపించారు. తాజాగా ఓ స్కూల్ విద్యార్థి సామి సామి పాటకు చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ పర్ఫామెన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

19 సెకండ్ల ఈ  వీడియోలో స్కూల్ యూనిఫాం ధ‌రించిన‌ విద్యార్ధిని.. సామి సామి పాటకు  క్రేజీ స్టెప్స్‌ వేసింది. డీజే మిక్స్ అయిన సామి సామి సాంగ్ కు సరికొత్త స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. ఎక్కడా భయం కానీ..బెరుకు గానీ లేకుండా స్వేచ్ఛగా..బీట్కు తగ్గట్లు పెర్ఫామెన్స్ ఇచ్చింది. చిన్నారి డ్యాన్స్కు ఫిదా అయిన  తోటి విద్యార్థులు.. వారు కూడా కాలు కదిపారు. ఎంతో ఉత్సాహంగా..మరెంతో ఆసక్తికరంగా..ఈ చిన్నారి చేసిన  డ్యాన్స్‌  సినీ అభిమానులను, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో  ఇప్పటి వరకు 50 వేలకు పైగా ప్రజలు వీక్షించారు.