జడ్జ్ ఇంట్లో దొంగలు.. 4 నిమిషాల్లో 5 లక్షలు, బంగారం స్వాహా..

జడ్జ్ ఇంట్లో దొంగలు.. 4 నిమిషాల్లో 5 లక్షలు, బంగారం స్వాహా..

ఒకప్పుడు ఎండాకాలంలోనే దొంగలు పడేవారు. కానీ ఇప్పుడు దొంగలు కూడా అప్ గ్రేడ్ అయ్యారు. కాలంతో పని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఛాన్స్ దొరితే దోచేసుకుంటున్నారు. మధ్య ప్రదేశ్  ఇండోర్‌లోని విజయ్ నగర్‌లో రిటైర్డ్ జడ్జ్ రమేష్ గార్గ్ ఇంట్లో గుర్తు తెలియని దొంగలు రూ.5 లక్షలకు పైగా విలువైన నగలు, డబ్బు దోచుకున్నారు . నాలుగు నిమిషాల పది సెకన్ల పాటు జరిగిన ఈ దొంగతనం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తుంది, ముసుగు ధరించిన దొంగలు గేటు తాళం పగలగొట్టి ఇంట్లోని విలువైన వస్తువులు సహా బీరువాలోని  బంగారం, డబ్బు దొంగతనం చేసారు. 

ప్రస్తుతం ఈ షాకింగ్ దొంగతనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిటైర్డ్ జడ్జ్ కొడుకు బెడ్ పై పడుకొని ఉండగా ఒక దొంగ చేతిలో రాడ్ పట్టుకుని కాపలాగా ఉంటూ మరొక దొంగ బీరువా నుండి డబ్బు, నగలు దోచుకెళ్లడం కనిపిస్తుంది. 

ఇదంతా గత ఆదివారం ఉదయం సమయంలో జరిగినట్లు సీసీటీవీలో రికార్డింది. విషయం ఏంటంటే దొంగతనం జరిగేటప్పుడు ఇంటి అలారం సిస్టం జస్టిస్ గార్గ్ కుమారుడు రిత్విక్‌ అప్రమత్తం చేయడంలో ఫెలైంది, దింతో దొంగలు హాయిగా తప్పించుకున్నారు. సమాచారం ప్రకారం దొంగలు ఇంటి లోపలికి రావడానికి ఇనుప కిటికీ గ్రిల్‌ను కత్తిరించారు, అయితే బయట ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. మరో విషయం ఏంటంటే రిత్విక్ భార్య, పిల్లలు దొంగతనం జరుగుతున్న పక్క రూంలోనే  ఉన్నారు. 

Also Read : ట్రంప్.. మనసులో ఇంత పెట్టుకున్నవా

అయితే ఈ దొంగతనం ఇండోర్‌లని విజయ్ నగర్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది, ప్రముఖులు ఉంటున్న ఒక  కీలక ప్రాంతంలో దొంగతనం అనేది భద్రత గురించి ఆందోళనలు పుట్టిస్తున్నాయి. ఒక రిటైర్మెంట్  జడ్జ్ ఇంటినే  టార్గెట్ చేసుకొని దొంగతనం చేయడం పోలీసులకి సవాలుగా మారింది. దీనిపై  స్థానిక  పోలీసులు కేసు నమోదు చేసుకోగా, నిందితులను పట్టుకోవడానికి ప్రస్తుతం సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.