నదిపై యువకుడి బైక్ డ్రైవింగ్.. వీడియో వైరల్

నదిపై యువకుడి బైక్ డ్రైవింగ్.. వీడియో వైరల్

సోషల్ మీడియోలో రోజూ లక్షల సంఖ్యలో వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతూ ఉంటాయి. అదే తరహాలో ఓ యువకుడు నీటిపై బైక్ డ్రైవింగ్ చేసే ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 5లక్షల వ్యూస్ రాగా, 2800లైకులు వచ్చాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ క్లిప్పింగ్ లో ఓ యువకుడు బజాబ్ పల్సర్ మోటార్ సైకిల్ పై కూర్చొని, వీపుకి కాలేజ్ బ్యాగు తగిలించుకుని డ్రైవింగ్ చేస్తూ నదిలోకి వెళ్లిపోయాడు. నదిలో మోకాళ్లలోతు వరకు నీరు ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి తన బైక్‌పై నదిని దాటి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 

ఎక్కడ సంకల్పం ఉంటుందో అక్కడ మార్గం ఉంటుందనే క్యాప్షన్ తో ట్విట్టర్ లో వైరల్ అవుతోన్న ఈ వీడియోలోని యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని, లోతైన నీటిలోకి వెళ్తే ఇంజిన్ పరిస్థితి ఏంటి అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను చిన్నప్పటి నుంచి అక్కడే  నివసిస్తున్నాడని, ఆ విషయం స్థానికులకు కూడా తెలుసని, ఇది అస్సాంలో సాధారణమని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

https://twitter.com/MotorOctane/status/1643988014878818306