వైరల్ వీడియో: ఒకే బైకుపై ఏడుగురు

వైరల్ వీడియో:  ఒకే బైకుపై ఏడుగురు

కారులో ఏడుగురు అంటేనే అబ్బో అంటాం.. టూ వీలర్ పై ఏడుగురు జర్నీ చేస్తే..ఇంపాజిబుల్ అంటాం. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే బైక్ పై ఏడుగురు...అంటే బైకర్ తో పాటు ఇద్దరు మహిళలు...నలుగురు పిల్లలు..మొత్తంగా బైక్ పై జర్నీ చేశారు. బండి పెట్రోల్ ట్యాంక్ పై ఇద్దరు పిల్లలు..బైకర్..ప్లస్ ఇద్దరు మహిళలు..వాళ్ల ఒడిలో మరో ఇద్దరు పిల్లలు..ఫైనల్ గా సింగిల్ బైక్...సెవెన్ మెంబర్స్.  వీడియో చూస్తుంటేనే మాటలు రావడం లేదుకదూ..!.. 
ఈ వీడియో పాతదే.. అయితే  ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు తాజాగా ఈ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘మాటల్లేవ్..’’ అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన గంటల్లోనే ఈ వీడియోను లక్షల మంది చూశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించి తమ అభిప్రాయాల్ని షేర్ చేస్తున్నారు.  డేంజరస్.. అమ్మో.. అని కొంత మంది..  గత్యంతరం లేని పరిస్థితుల్లో.. వేరే మార్గం లేని పరిస్థితుల్లో ఆడోళ్లు.. పిల్లల్ని అలా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందేమోనంటుంటే.. మరికొందరు వ్యంగ్యంగా సెటైర్లు విసురుతూ కామెంట్లు పెడుతున్నారు.