వరద నీటిలో బోట్‭లా దూసుకెళ్లిన బస్సు.. వీడియో వైరల్

వరద నీటిలో బోట్‭లా దూసుకెళ్లిన బస్సు.. వీడియో వైరల్

న్యూజిలాండ్‭లోని ఆక్లాండ్‭ను భారీ వరదలు ముంచెత్తాయి. చెట్లు నేలకొరిగి.. చాలా చోట్ల ఇండ్లు కూలిపోయాయి. ఎక్కడికక్కడ రహదారులన్నీ వరద నీటితో నిండిపోవడంతో జనజీవనం అస్థవ్యస్తమైంది.  ఇలాంటి పరిస్థితుల్లో కూడా ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు కొనసాగుతున్నాయి. అయితే డెబ్బీ బర్రోస్ అనే మహిళ  పోస్ట్ చేసిన వరద నీటిలో బోటులా దూసుకుపోతున్న ఓ బస్సు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ రోడ్డుపై నడుమ లోతు వరద నీరు చేరడంతో ముందుకు వెళ్లలేక కార్లు ఆగిపోయాయి. అంత నిండుగా ఉన్న వరద నీళ్లల్లో ఒక పెద్ద బస్సు చాలా సునాయాసంగా వెళ్లిపోయింది. అందులో ప్యాసింజర్లు కూడా కనిపిస్తున్నారు. అంతేగాదు నీళ్లు ఒకవైపు నుంచి లోపలకు వెళ్తుంటే మరోవైపు నుంచి బయటకు వచ్చేస్తున్న వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.