కొత్తేడాది వేడుకల ఎఫెక్ట్: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

కొత్తేడాది వేడుకల ఎఫెక్ట్: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
  • న్యూ ఇయర్‌‌‌‌ వేడుకలకు టూరిస్టుల రద్దీ
  • మాస్కుల్లేవ్.. ఫిజికల్ డిస్టెన్స్ అసలే లేదు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు
  • భారీగా పెరుగుతున్న కేసులు

న్యూఢిల్లీ: గోవాలోని ‘బాగా బీచ్’ అది.. టూరిస్ట్ స్పాట్‌‌‌‌‌‌‌‌గా పేరున్న ప్రాంతం.. చీమ దూరే సందు లేకుండా వందలాది మంది గుమిగూడారు. కరోనా రూల్స్ ఒక్కరూ ఫాలో కాలేదు. మాస్కుల్లేవ్.. ఫిజికల్ డిస్టెన్స్ అసలే లేదు. ఆదివారం ఇందుకు సంబంధించిన వీడియోలు బయటికి రాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిస్మస్ టైం నుంచి అక్కడ పరిస్థితి ఇలానే ఉంది. దీంతో కరోనాకు రెక్కలొచ్చాయి. కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు హాట్‌‌‌‌‌‌‌‌ స్పాట్‌‌‌‌‌‌‌‌లా మారింది గోవా. ‘‘కరోనా వేవ్‌‌‌‌‌‌‌‌కు టూరిస్టులు ఘన స్వాగతం పలుకుతున్నరు’’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

10 శాతం దాటిన పాజిటివిటీ రేటు

న్యూఇయర్ సందర్భంగా గోవాకు టూరిస్టులు వేలాదిగా వచ్చారు. ఆంక్షలున్నా సరే బీచ్‌‌‌‌‌‌‌‌లు, పబ్‌‌‌‌‌‌‌‌లు, నైట్ క్లబ్బులకు పోటెత్తారు. దీంతో గోవాలో కరోనా కేసుల పాజిటివిటీ రేటు ఆదివారం 10.7 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో 388 మంది వైరస్ బారిన పడినట్లు ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. ప్రస్తుతం 1,671 యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పింది. దీంతో గోవా సర్కారు నైట్ కర్ఫ్యూ విధించింది. స్కూళ్లు, కాలేజీలను ఈనెల 26వ తేదీ దాకా 
మూసేయాలని ఆదేశాలిచ్చింది.