మీ వెరైటీతో మైండ్ బ్లాంక్ : ఎనర్జీ డ్రింక్ తో.. మ్యాగీ తయారీ..

మీ వెరైటీతో మైండ్ బ్లాంక్ : ఎనర్జీ డ్రింక్ తో.. మ్యాగీ తయారీ..

మ్యాగీ అంటే 2 నిమిషాల్లో అయిపోతుంది అనే అడ్వర్ టైజ్ కావొచ్చు.. దాన్ని తయారు చేయాలంటే మాత్రం నీళ్లు కామన్. ఓ గ్లాస్ నీళ్లు పోసి.. మ్యాగీ ప్యాకెట్ ఓపెన్ చేసి.. నిమిషం తర్వాత అందులో ఓ చిన్న ప్యాకెట్ మసాలా వేస్తే ఐదు నిమిషాల్లో వేడి వేడి మ్యాగీ తయారు.. మ్యాగీని మంచినీళ్లు పోసి తయారు చేస్తారనేది అందరికీ తెలిసింది. అలా కాకుండా ఎనర్జీ డ్రింక్ తో.. మ్యాగీ తయారు చేస్తే.. వినటానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం..

స్ట్రీట్ ఫుడ్ వెండర్ ఇటీవల ఒక ఎరేటెడ్ డ్రింక్‌తో మ్యాగీ నూడుల్స్‌ను తయారు చేస్తున్నట్లు చూపించే ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియో వైరల్‌గా మారింది. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో మ్యాగీని ఇష్టపడుతూ ఉంటారు. కొందరు కేవలం నీటితో ఇష్టపడితే.. మరికొందరు కూరగాయలు, ఇతర ఇంగ్రీడియంట్స్ తో లైక్ చేస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా మీ నూడుల్స్‌ను నీటికి బదులుగా ఎనర్జీ డ్రింక్‌లో కలిపి ట్రై చేశారా?

అయ్యో! దానికే అసహ్యంగా అనిపించిందా? నెయ్యి, మసాలా, మరికొన్ని పదార్థాలతో పాటు స్టింగ్ ఎనర్జీ డ్రింక్‌తో మ్యాగీని తయారు చేయడం కూడా ఈ వీడియోలో ఉంది. ముందుగా స్టింగ్ ను బౌల్ లో పోసి, అందులో మ్యాగీ, కొన్ని వెజిటేబుల్స్ ను జోడించి.. చివరికి మసాలాతో సర్వ్ చేయడం ద్వారా ఈ స్టింగ్ మ్యాగీ తయారవుతుంది.

ఈ వీడియోలో చూపించిన దాని ప్రకారం కూల్‌డ్రింక్ ఉడకబెట్టడం జరుగుతుంది. అయితే అలా తయారైన ఈ వంటకం తినదగినదేనా? అన్నది ఆందోళన కలిగించే ప్రశ్నగా మారింది. ఈ వీడియోపై స్పందించిన యూజర్స్.. ఈ వంటకం ఆరోగ్యానికి హానికరం అని కామెంట్ చేస్తున్నారు. కొందరు కామెంట్స్ సెక్షన్‌లోకి వెళ్లి 'స్టింగ్ వాలీ మ్యాగీ' అని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఫుడ్ రీల్ గత నెలలో సోషల్ మీడియాలో కనిపించగా.. అప్పటి నుండి, ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడు మిలియన్లకు పైగా వ్యూస్ ను పొందింది. ఈ వీడియోపై అనాసక్తి పొందుతున్న కొందరు నెటిజన్లు డిస్‌లైక్ బటన్ కోసం వెతుకుతున్నారు.