కొండపై నుంచి 300 అడుగులు కిందకు పడిన యువకుడు

కొండపై నుంచి 300 అడుగులు కిందకు పడిన యువకుడు

కర్ణాటకలోని నందిహిల్స్ పై ట్రెకింగ్ చేస్తూ చిక్కుకుపోయిన యువకుడిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రక్షించింది. ఎంఐ 17 హెలికాప్టర్ లో రెస్క్యూ చేసి.. అతడిని ఆస్పత్రికి తరలించారు. నిషాంక్ అనే 19 ఏండ్ల స్టూడెంట్ ఆదివారం నంది హిల్స్ లో ట్రెకింగ్ కు వెళ్లాడు. అతడు కొండపైకి ఎక్కుతుండగా.. ఒక పీక్ దగ్గర సడన్ గా జారిపడిపోయాడు. దీంతో దాదాపు 300 అడుగులు కిందికి జారుకుంటూ బ్రహ్మగిరి కొండపై పడిపోయాడు. దీనిపై చిక్కబల్లాపూర్ పోలీసులకు ఎస్ఓఎస్ మెసేజ్ అందడంతో వారు కలెక్టర్  కు సమాచారం ఇచ్చారు. దీంతో కలెక్టర్ బెంగళూరులోని ఎలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులను రిస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సిందిగా కోరారు. వెంటనే రంగంలోకి దిగిన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఎంఐ17 హెలికాప్టర్ లో నిషాంక్ ను రక్షించారు. అతడికి ఫ్లైట్ లోనే ప్రాథమిక చికిత్స చేసి.. ఆ తర్వాత సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఇటీవలే కేరళలోని మలపుజా పర్వతంపై కొండ మధ్యలో చిక్కుకుపోయిన ఓ యువకుడిని ఆర్మీ రెస్క్యూ చేసింది.