IND vs NZ: విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ.. వన్డేల్లో కొత్త చరిత్ర.. సచిన్ రికార్డ్ బ్రేక్

IND vs NZ: విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ.. వన్డేల్లో కొత్త చరిత్ర.. సచిన్ రికార్డ్ బ్రేక్

వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లీగ్ మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు చేసిన విరాట్.. కీలకమైన సెమీస్ లో న్యూజిలాండ్ పై బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి భారత్ ను ముందుండి నడిపిస్తున్నాడు. ఈ సెంచరీతో కోహ్లీ తన వన్డే కెరీర్ లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. దీంతో వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిన్నటివరకు 49 వ సెంచరీలతో సచిన్ తో సమానంగా ఉన్న కోహ్లీ తాజాగా క్రికెట్ గాడ్ రికార్డ్ బ్రేక్ చేసాడు.

106 బంతుల్లో ఒక సిక్స్, 8 ఫోర్లతో కోహ్లీ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీకి తోడు గిల్, అయ్యర్ హాఫ్ సెంచరీలు చేయడంతో భారత్ 400 పరుగుల మీద కన్నేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు రోహిత్ 29 బంతుల్లోనే 47 పరుగులు చేసి సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత గిల్, కోహ్లీ బాధ్యతగా ఆడుతూ జట్టు స్కోర్ ను ముందుకు నడిపించారు. 79 పరుగులు చేసిన గిల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఈ సమయంలో  అయ్యర్, కోహ్లీ మరో భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు.
 
ఈ క్రమంలో కోహ్లీ తన 50వ సెంచరీని, అయ్యర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ 41.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 297 పరుగులు చేసింది. కోహ్లీ(100) , అయ్యర్(66) క్రీజ్ లో ఉన్నారు.