Virat Kohli : విరాట్ కోహ్లీ ఆరుదైన రికార్డు

Virat Kohli  :  విరాట్ కోహ్లీ ఆరుదైన రికార్డు

ఐపీఎల్ 2023లో భాగంగా  ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో కింగ్‌‌  విరాట్ కోహ్లీ తనదైన ఆటతో జట్టును గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్తో విరాట్ కోహ్లీ ఆరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో  82 పరుగులు చేసిన కోహ్లీ ఐపీఎల్లో  50 సార్లు 50 ప్లస్ స్కోర్ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. కోహ్లీ కంటే ముందుగా ఈ లిస్టులో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్  డేవిడ్ వార్నర్ 60 హాఫ్ సెంచరీలు చేసి టాప్లో ఉన్నాడు.  పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 49 సార్లు హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ పేరు మీద ఐపీఎల్లో 45 హాఫ్ సెంచరీలు 5 సెంచరీలు ఉన్నాయి.