Virat Kohli: వన్డే క్రికెట్ చరిత్రలో కోహ్లీ రికార్డ్

Virat Kohli: వన్డే క్రికెట్ చరిత్రలో కోహ్లీ రికార్డ్

టీమిండియా ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ కోహ్లి సెంచరీ చేసి భారీ స్కోర్ చేసేందుకు సాయపడ్డాడు. అయితే, ఈ మ్యాచ్ విజయంతో కోహ్లీ మరొక రికార్డ్ ని తన పేరిట రాసుకున్నాడు. 

వన్డే ఛేజింగ్ లో విరాట్ కి మొత్తం 37 సెంచరీలు ఉండగా.. కోహ్లి సెంచరీ చేసిన 37 సార్లు టీమిండియా గెలిచింది. దీంతో వన్డే చరిత్రలో 37 విన్నింగ్ నాక్స్ ఆడిన తొలి ఆటగాడిగా కింగ్ కోహ్లి రికార్డు సృష్టించాడు. అయితే, ఇదివరకు ఈ రికార్డ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 33 సార్లు విన్నింగ్ నాక్స్ ఆడాడు.