
దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ జరిమానా ఎదుర్కొన్నాడు. పంజాబ్ చేతిలో 97 రన్స్ తేడాతో చిత్తు గా ఓడిన ఆర్‌సీబీ నిర్ణీత టైమ్‌లో ఇన్నిం గ్స్ పూర్తి చేయలేకపోయింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఫస్ట్ టైమ్ స్లో ఓవర్ రేట్ తప్పి దం చేయడంతో కెప్టెన్ కోహ్లీ కి రూ. 12 లక్షల జరిమానా విధించినట్టు ఐపీఎల్ శుక్రవారం ప్రకటించింది