
వరల్డ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అతని భార్య అనుష్క శర్మ మైదానంలో చేసే సందడి మ్యాచ్ కే ప్రధాన ఆకర్షనగా మారుతుంది. విరాట్ జట్టు మ్యాచ్ గెలిచినప్పుడు లేదా అతను వ్యక్తిగత మైల్ స్టోన్ అందుకున్నప్పుడు అనుష్క స్టేడియంలో విరాట్ కు ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది. తాజాగా వీరిద్దరి మధ్య రొమాన్స్ ఐపీఎల్ 2025 లో వైరల్ గా మారుతుంది. లక్నో వేదికగా మంగళవారం (మే 27) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ, అనుష్క శర్మ ఫ్లైయింగ్ కిస్ లు ఇచ్చుకోవడం సోషల్ మీడియాలో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Also Read:-ఒకే తప్పు మూడు సార్లు రిపీట్ చేసిన పంత్.. రూ. 30 లక్షల జరిమానా
228 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకదశలో 121 పరుగులకే నాలుగు వికెట్లు ఓటమి దిశగా సాగుతుంది. ఈ దశలో ఆర్సీబీ స్టాండింగ్ కెప్టెన్ జితేష్ శర్మ అసాధారణంగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించాడు. 33 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. జితేష్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు.. 6 సిక్సర్లు ఉన్నాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత కోహ్లీ తనదైన శైలిలో సెలెబ్రేషన్ చేసుకున్నాడు. డగౌట్ లో తన సహచరుడు కృనాల్ పాండ్యతో కలిసి ఎగిరి గంతేసిన కింగ్.. ఆ తర్వాత గ్రౌండ్ మొత్తం తిరిగి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు.
ఈ క్రమంలో కోహ్లీ తన భార్య అనుష్క శర్మకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. కోహ్లీ ఫ్లైయింగ్ కిస్ కు స్పందించిన అనుష్క రెండు సార్లు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం విశేషం. స్టేడియంలో వీరిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ ముచ్చట గొలిపేలా ఉంది. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 30 బంతుల్లో 10 ఫోర్లతో 54 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది.
The flying kiss by Virat Kohli to our lucky charm ❤️ https://t.co/Sqlbn1TWai
— Sonusays (@IamSonu____) May 27, 2025