LSG vs RCB: జట్టుకు కూడా తప్పని శిక్ష: ఒకే తప్పు మూడు సార్లు రిపీట్ చేసిన పంత్.. రూ. 30 లక్షల జరిమానా

LSG vs RCB: జట్టుకు కూడా తప్పని శిక్ష: ఒకే తప్పు మూడు సార్లు రిపీట్ చేసిన పంత్.. రూ. 30 లక్షల జరిమానా

ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్ లో మూడోసారి స్లో ఓవర్ రేట్ కు గురయ్యాడు. మంగళవారం (మే 27) రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్ కు బీసీసీఐ రూ.30 లక్షల రూపాయల ఫైన్ వేశారు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ లో మూడో సారి స్లో ఓవర్ రేట్ ఎదుర్కొన్న తొలి కెప్టెన్ గా నిలిచాడు. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో లక్నో మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఛేజింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ దాదాపు రెండు గంటల పాటు జరిగింది. ఫీల్డింగ్ లో మార్పులు చేయడానికి పంత్  ఎక్కువగా సమయం తీసుకున్నాడు.

మూడోసారి స్లో ఓవర్ రేట్ కావడంతో కెప్టెన్ తో పాటు లక్నో జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు కూడా భారీ ఫైన్ వేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ తో సహా జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు టోర్నమెంట్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఒక్కొక్కరికి రూ. 12లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50% ఏది తక్కువైతే అది జరిమానా విధించబడుతుంది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా శిక్ష అనుభవించిన కెప్టెన్ల లిస్ట్ లో పంత్ తో పాటు శుభ్‌మాన్ గిల్ (గుజరాత్), అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్), సంజు సామ్సన్ (రాజస్థాన్ రాయల్స్), రజత్ పాటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్ ), హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్) ఉన్నారు.

ఈ సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్లకు జరిమానా విధించబడదు. అయితే కెప్టెన్లకు డీమెరిట్ పాయింట్లు ఇస్తారు. ఇవి మూడు సంవత్సరాల పాటు కొనసాగుతాయి. ఈ నిషేధం తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో పంత్ బ్యాటింగ్ లో దుమ్ములేపాడు. 55 బంతుల్లోనే సెంచరీ చేసిన రిషబ్ ఓవరాల్ గా 61 బంతుల్లో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పంత్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండడం విశేషం. 

Also Read:-విరాట్ ఒకటి.. అనుష్క రెండు: ఫ్లైయింగ్ కిస్‌తో విరుష్క జోడీ సెలెబ్రేషన్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయాన్ని అందుకుంది. మంగళవారం (మే 27) లక్నో సూపర్ జయింట్స్ పై 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి రాయల్ గా క్వాలిఫయర్ 1 లోకి అడుగుపెట్టింది. భారీ ఛేజింగ్ లో ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మ (33 బంతుల్లో 85: 6 సిక్సులు, 8 ఫోర్లు) వీరోచిత ఇన్నింగ్స్ కు తోడు కోహ్లీ (54) హాఫ్ సెంచరీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది.