ICC ODI rankings: రోహిత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి .. నాలుగేళ్ల తర్వాత నెంబర్ వన్ స్థానానికి కోహ్లీ

ICC ODI rankings: రోహిత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ..  నాలుగేళ్ల తర్వాత నెంబర్ వన్ స్థానానికి కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ బుధవారం (జనవరి 14) ప్రకటించిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ సహచరుడు రోహిత్ శర్మను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. నాలుగేళ్ల తర్వాత కోహ్లీ వన్డేల్లో నెంబర్ వన్ కు చేరుకోవడం విశేషం. చివరిసారిగా కోహ్లీ వన్డేల్లో జూలై 2021 లో నెంబర్ స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లీ వన్డే కెరీర్ లో తొలిసారి 2013లో తొలిసారి నెంబర్ ర్యాంక్ కు చేరుకున్నాడు. ప్రస్తుత వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీ 785 రేటింగ్ పాయింట్స్ తో కోహ్లీ టాప్ లో ఉండగా.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 784 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 

మిచెల్ కోహ్లీ మధ్య కేవలం ఒక రేటింగ్ పాయింట్ మాత్రమే ఉండడం గమనార్హం. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్దేలో హిట్ మ్యాన్ కేవలం 26 పరుగులు చేసి నిరాశపరిచాడు. మరోవైపు కోహ్లీ 93 పరుగులు చేసి సత్తా చాటి నెంబర్ ర్యాంక్ కు చేరుకున్నాడు. తొలి వన్డేలో ఇండియాపై మిచెల్ 84 పరుగులు చేసి రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు. టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ ఐదో స్థానంలో నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ జద్రాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 10 వ స్థానంలో నిలిచాడు.  

కోహ్లీ టాప్ ఫామ్: 

విరాట్ కోహ్లీ టాప్ ఫామ్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా టూర్ లో హాఫ్ సెంచరీ కొట్టి టచ్ లోకి వచ్చిన కోహ్లీ.. ఆ తర్వాత సౌతాఫ్రికాపై మూడు వన్డేల సిరీస్ లో రెండు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం కివీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లోనూ విరాట్ అదరగొట్టేస్తున్నాడు. తొలి వన్డేలో 93 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కోహ్లీ చివరి ఐదు వన్డేలు చూసుకుంటే వరుసగా 74*, 135, 102, 65*, 93 ఉన్నాయి. ప్రతి మ్యాచ్ లో సెంచరీ లేదా హాఫ్ సెంచరీ చేయడం కింగ్ కు కామన్ అయిపోయింది. నాలుగేళ్ల తర్వాత నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న కోహ్లీ తన ర్యాంక్ ను ఇప్పటివరకు కాపాడుకుంటాడో చూడాలి.