బెంగళూరు: కెప్టెన్ ప్రభుసిమ్రన్ సింగ్ (88), అన్మోల్‌ప్రీత్ సింగ్ (70), హర్నూర్ సింగ్ (51), నేహల్ వధేరా (56) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోవడంతో .. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో పంజాబ్ 183 రన్స్ భారీ తేడాతో మధ్యప్రదేశ్‌పై నెగ్గింది. టాస్ ఓడిన పంజాబ్ 50 ఓవర్లలో 345/6 స్కోరు చేసింది. రమన్‌దీప్ సింగ్ (24 నాటౌట్), నమన్ ధీర్ (23) ఫర్వాలేదనిపించారు. త్రిపురేశ్ సింగ్, వెంకటేశ్ అయ్యర్ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో మధ్యప్రదేశ్ 31.2 ఓవర్లలో 162 రన్స్‌కే కుప్పకూలింది. రజత్ పటీదార్ (38), త్రిపురేశ్ సింగ్ (31) కాసేపు ప్రతిఘటించినా మిగతావారు చేతులెత్తేశారు. ఇన్నింగ్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సన్వీర్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. ప్రభుసిమ్రన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. శుక్రవారం జరిగే సెమీస్‌లో పంజాబ్.. సౌరాష్ట్రతో తలపడుతుంది.
