టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. సౌతాఫ్రికాపై రెండో వన్డేలోనూ సెంచరీతో అదరగొట్టాడు. బుధవారం (డిసెంబర్ 3) రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో 90 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో సత్తా చాటాడు. కోహ్లీ వన్డే కెరీర్ లో ఇది 53వ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్ లో ఇది 84వ సెంచరీ. ఇన్నింగ్స్ 38 ఓవర్ చివరి బంతికి మార్కో జాన్సెన్ బౌలింగ్ లో సింగిల్ తీసుకున్న కోహ్లీ 90 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి.
తొలి వన్డేలో సెంచరీతో సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ రెండో వన్డేలో కూడా అదే జోరు చూపించాడు. ఆరంభంలోనే సిక్సర్ తో ఇన్నింగ్స్ ను దూకుడుగా ప్రారంభించాడు. గైక్వాడ్ తో కలిసి సఫారీ బౌలర్లను అలవోకగా ఆడేశాడు. ఈ క్రమంలో విరాట్ 52 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా విరాట్ జోరు ఎక్కడా తగ్గలేదు. సింగిల్స్ తీస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఇదే జోరు మీద సెంచరీ పూర్తి చేసుకొని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేశాడు. మూడో వికెట్ కు గైక్వాడ్ తో కలిసి కోహ్లీ 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. కోహ్లీతో పాటు గైక్వాడ్ సెంచరీతో అదరగొట్టడంతో ప్రస్తుతం ఇండియా 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. క్రీజ్ లో కోహ్లీ (100), రాహుల్ (14) ఉన్నారు. ఈ మ్యాచ్ లోనూ ఇండియా 350 పరుగుల దిశగా దూసుకెళ్తుంది. ఓపెనర్లు జైశ్వాల్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ నిరాశపరిచాడు. 22 పరుగులకే ఔటయ్యాడు. రోహిత్ శర్మ 14 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు.. బర్గర్ ఒక వికెట్ తీసుకున్నారు.
𝙐𝙣𝙨𝙩𝙤𝙥𝙥𝙖𝙗𝙡𝙚! 👑
— BCCI (@BCCI) December 3, 2025
BACK to BACK ODI HUNDREDS for Virat Kohli 🫡🫡
His 5⃣3⃣rd in ODIs 💯
Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/sahZeIUo19
