
పరుగుల మిషెన్ టీమిండియా కెప్టెన్ వీరాట్ కోహ్లీ మరో రికార్డ్ సృష్టించాడు. హైప్ ఆడిటర్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 1000 మంది ఇన్ స్టాగ్రమ్ ప్రభావిత వ్యక్తులపై సర్వే చేయగా భారత్ నుంచి కోహ్లీ 12 వ స్థానంలో నిలిచాడు. ప్రధాని మోడీ 20 వ స్థానంలో అనుష్క శర్మ 26 వ స్థానంలో, దీపికా పదుకొనే 49 వ స్థానంలో నిలిచారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అటు ట్విట్టర్లో ఎక్కువ మంది ప్రస్తావించిన వ్యక్తుల్లో కోహ్లీ ఫస్ట్ ప్లేసులో నిలిచాడని ట్విట్టర్ తెలిపింది.