ICC T20 ర్యాంకింగ్స్ లో  కోహ్లీ నాలుగో స్థానం

ICC T20 ర్యాంకింగ్స్ లో  కోహ్లీ నాలుగో స్థానం

T20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 4వ స్థానంలో నిలిచాడు.  లేటెస్టుగా ICC  విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్ మొదటి స్థానంలో నిలిచాడు. కోహ్లీ తర్వాత మరో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు. రాహుల్ 6వ స్థానంలో ఉన్నాడు.

శ్రీలంకతో జరిగిన T20  సిరీస్‌లో రాణించిన సౌతాఫ్రికా వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డీకాక్ తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 8వ స్థానాన్ని చేరుకున్నాడు. బౌలర్ల లిస్టులో  ఎటువంటి మార్పులు జరగలేదు. అయితే టాప్ టెన్‌లో భారత బౌలర్లు ఎవరూ స్థానం పొందలేదు. భువనేశ్వర్ కుమార్ మాత్రం 12వ స్థానంలో ఉన్నాడు.

ఆల్‌రౌండర్ల జాబితాలో ఆఫ్ఘన్ సారధి మహమ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో బంగ్లాదేశ్ స్టార్ షకిబ్ అల్ హసన్ ఉన్నాడు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు ఫస్ట్  ప్లేస్ లో ఉండగా.. భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో పాకిస్తాన్ , నాలుగో స్థానంలో న్యూజిల్యాండ్, ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా ఉన్నాయి.