Virat Kohli Trolled Social Media: టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. కాకపోతే ఈసారి గ్రౌండ్ లో కొట్టిన పరుగుల వల్ల కాదు.. ఆయన చేసిన ఒక ప్రమోషనల్ యాడ్ వల్ల నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఎయిర్‌పోర్టుల్లో ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ ఈజీగా అవ్వడం కోసం కేంద్ర హోంశాఖ తీసుకొచ్చిన 'ఈ-గేట్స్' (e-gates) ను పొగుడుతూ కోహ్లీ ఒక వీడియో చేశాడు. దీన్ని బీజేపీ తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు కోహ్లీపై మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు.
నేను కూడా రెగ్యులర్ ఫ్లైయర్నే:
ఈ ప్రమోషనల్ వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ.. ఇండియన్ హోమ్ మినిస్ట్రీ తీసుకొచ్చిన ఈ-గేట్స్ వల్ల ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ స్మూత్‌గా మారింది. నేను కూడా ఎప్పుడూ ఇంటర్నేషనల్ ప్రయాణాలు చేస్తుంటాను.. ఈ ఈ-గేట్స్ రావడం వల్ల కౌంటర్ల దగ్గర గంటల తరబడి నిలబడే లొల్లి పూర్తిగా తప్పిపోయింది. ప్రాసెస్ చాలా స్పీడ్‌గా, ఎఫిషియంట్‌గా జరుగుతోంది.. నాలాంటి ట్రావెలర్స్ కోసం ఇంత మంచి సిస్టమ్ తెచ్చినందుకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు థాంక్స్ అని విరాట్ చెప్పాడు.
లండన్ కనెక్షన్ పై నెటిజన్ల సెటైర్స్:
ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు గట్టిగానే ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి లండన్‌లోనే సెటిల్ అయ్యాడనే టాక్ ఉంది. క్రికెట్ మ్యాచులు ఉన్నప్పుడు భారత్ కి రావడం.. మ్యాచులు ఆయిపోగానే ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్లడం ఆయనకి అలవాటుగా మారింది. కరెక్ట్ మొనగాడినే పట్టుకున్నారంటూ జనాలు జోకులు వేసుకుంటున్నారు. ఎందుకంటే కోహ్లీ కంటే ఎక్కువగా ఎయిర్‌పోర్ట్ ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఎవరికి తెలుస్తాయి.. లండన్ ట్రిప్పులు వేసే కోహ్లీకి ఈ యాడ్ పక్కా సెట్ అయిందంటూ విపరీతంగా మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
►ALSO READ | భారత్ నయా హిస్టరీ.. ఆఫ్ఘన్‌పై ఇన్సింగ్స్ 300 రన్స్ తేడాతో ఘన విజయం!
గాయం వల్ల ఆఫ్ఘన్ సిరీస్‌కు దూరం:
ఇక క్రికెట్ విషయానికి వస్తే.. మొన్నటి ఐపీఎల్ 2026 ఫైనల్‌లో (IPL 2026 Final) అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ను గెలిపించడానికి కోహ్లీ కష్టపడ్డాడు. ఆ మ్యాచ్‌లో 75 రన్స్ నాటౌట్‌తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. రన్నింగ్ చేసేటప్పుడు కుడి తొడ కండరాల గాయం (Right Hamstring Injury) ఎక్కువైంది. ఆ ఇంజ్యూరీ తగ్గకపోవడంతోనే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరమయ్యాడు. బీసీసీఐ (BCCI) కోహ్లీ ప్లేస్‌లో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌ను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది.
e-Gates के लिए गृह मंत्रालय को बहुत-बहुत धन्यवाद!
— BJP (@BJP4India) June 7, 2026
भारतीय गृह मंत्रालय द्वारा शुरू किए गए e-Gates इमिग्रेशन सिस्टम ने अब एयरपोर्ट पर इमिग्रेशन प्रक्रिया पहले से कहीं अधिक तेज़, सुरक्षित और आसान बना दिया है।
जानिए, इस पहल के बारे में क्या कहते हैं भारतीय क्रिकेट स्टार Virat… pic.twitter.com/TRnYUB93hh
e-Gates के लिए गृह मंत्रालय को बहुत-बहुत धन्यवाद!
— BJP (@BJP4India) June 7, 2026
भारतीय गृह मंत्रालय द्वारा शुरू किए गए e-Gates इमिग्रेशन सिस्टम ने अब एयरपोर्ट पर इमिग्रेशन प्रक्रिया पहले से कहीं अधिक तेज़, सुरक्षित और आसान बना दिया है।
जानिए, इस पहल के बारे में क्या कहते हैं भारतीय क्रिकेट स्टार Virat… pic.twitter.com/TRnYUB93hh
