విరాట్ కోహ్లీ vs సౌరవ్ గంగూలి.. బయట పడుతున్న నిజాలు

విరాట్ కోహ్లీ vs సౌరవ్ గంగూలి.. బయట పడుతున్న నిజాలు

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మధ్య విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కోహ్లీ కెప్టెన్సీని వదలిపెట్టడానికి, ఫామ్ కోల్పోయి డిప్రెషన్ లోకి వెళ్లడానికి సౌరవ్ నే కారణం అని ఫాన్స్ అంటున్న మాట. అయితే, ఏది ఏమైనా.. ఈ ఇద్దరికీ పడట్లేదన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అదే నిజం అనిపించేలా కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శనివారం నాడు బెంగళూరు, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో.. హాఫ్ సెంచరీ తర్వాత విరాట్ కోహ్లీ చేసిన సెలబ్రేషన్స్.. గంగూలికి ఇచ్చిన సమాధానంలా అనిపించాయి. ఫీల్డింగ్ చేస్తున్న టైంలో కూడా విరాట్ హావాభావాలు కొంచెం గంగూలిని ఉద్దేశించిన విదంగా అనిపించాయి. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగిపోయింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత.. ఇరు జట్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న టైంలో గంగూలి, విరాట్ కోహ్లీ నుంచి దూరంగా వెళ్లిపోయాడు. దీంతో అభిమానుల అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే, సోమవారం విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ సహా పలు సోషల్ మీడియాల్లో అన్ ఫాలో చేశాడు. ఈ దెబ్బతో వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని స్పష్టం అయింది. సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ అన్నీ నిజమేనని తెలుస్తోంది. ఈ విషయంలో కోహ్లీ ఫ్యాన్స్ గంగూలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.