ఒక్క తప్పు.. టోర్నీనే దెబ్బతీస్తుంది

ఒక్క తప్పు.. టోర్నీనే దెబ్బతీస్తుంది

బయోబబుల్‌ ‌అస్సలు దాటొద్దు
ఫస్ట్ మీటింగ్‌‌లోనే టీమ్‌‌మేట్స్‌‌కు కోహ్లీ వార్నింగ్‌‌

దుబాయ్‌‌: ఎవరో ఒక్క ప్లేయర్‌ చేసిన చిన్న తప్పు టోర్నీ మొత్తాన్ని స్పాయిల్‌ ‌చేయగలదని రాయల్‌‌ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన టీమ్‌మేట్స్‌ను హెచ్చరించాడు. బయో బబుల్‌‌ను సురక్షితంగా ఉంచేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. ఈ మేరకు సోమవారం జరిగిన ఆర్సీబీ ఫస్ట్‌ ‌వర్చువల్‌ ‌మీటింగ్‌‌లోనే తోటి ఆటగాళ్లకు కోహ్లీ స్పష్టమైన ఆదేశాలిచ్చాడు. కరోనా నేపథ్యంలో ఆతిథ్య యూఏఈ అధికారులు అమలు చేస్తున్న ప్రొటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని సూచించాడు. ‘ఇప్పటిదాకా మనకు ఏం చెప్పారో దాన్ని పాటించాం. ఇప్పుడు బయో బబుల్‌ ‌విషయంలోనూ అలాగే బాధ్యతగా ఉంటారని ఆశిస్తున్నా. ఈ విషయంలో రాజీ పడరని అనుకుంటున్నా. ఎందుకంటే మనలో ఎవరైనా ఒక్క మిస్టేక్‌ చేసినా అది టోర్నీ మొత్తాన్ని స్పాయిల్‌‌ చేయగలదు. అలా జరగాలని మనలో ఎవ్వరూ కోరుకోవడం లేదు. కాబట్టి బయో బబుల్‌‌ను ప్రొటెక్ట్‌ ‌చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి’ అని విరాట్‌ స్పష్టం చేశాడు. అలాగే, తొలి రోజు నుంచే టీమ్‌ కల్చర్ డెవలప్‌ చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ‘ఫస్ట్‌‌డే ప్రాక్టీస్‌‌ కోసం ఇంకా ఎదురు చూడలేకపోతున్నా. దాని కోసం మనమంతా ఉత్సాహంగా ఉన్నాం. డే వన్‌ నుంచే గుడ్‌ టీమ్‌ కల్చర్ను క్రియేట్‌ చేసేందుకు ఇదో అవకాశం. నా వరకైతే టీమ్‌లో ప్రతి ఒక్కరూ సమంగా భావించే, ప్రతి ఒక్కరూ సమాన బాధ్యత వహించే ఎన్విరాన్మెంట్‌ను క్రియేట్‌ చేయాలనుకుంటున్నా. మనం క్వాలిటీ క్రికెట్‌ ఆడాలి. దాని కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఫస్ట్‌ ‌సీనియర్లు ముందడుగు వేయాలి’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇక, బయో బబుల్‌‌ దాటితే ఎదుర్కొనే కఠిన చర్యల గురించి టీమ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్ మైక్‌ హేసన్‌ ప్లేయర్లకు వివరించారు. హెడ్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ కూడా పాల్గొన్న ఈ మీటింగ్‌ ‌వీడియోను ఆర్‌సీబీ టీమ్‌ ట్విట్టర్ లో షేర్ చేసింది.

For More News..

సరైనోడు లేకే వరల్డ్‌‌‌‌కప్‌ ఓడాం

అదానీ చేతికి ముంబై ఎయిర్‌‌‌‌పోర్టు?

వరుసగా నాలుగో రోజూ దిగిన బంగారం రేట్లు