వర్చువల్‌‌‌‌‌‌‌‌  పేషెంట్లు  వచ్చేశారు

వర్చువల్‌‌‌‌‌‌‌‌  పేషెంట్లు  వచ్చేశారు

విఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (వర్చువల్ రియాలిటీ)లో జరిగిన పెండ్లిళ్లు, ఫంక్షన్స్‌‌‌‌‌‌‌‌, మీటింగ్స్‌‌‌‌‌‌‌‌ గురించి వినే ఉంటారు కదా. ఇవే కాకుండా ఇంకా రకరకాల ఈవెంట్లు కూడా వేదికైంది. భవిష్యత్తులో అంతా వర్చువల్‌‌‌‌‌‌‌‌ రియాలిటీనే ఉంటుందని అంటున్నారు డెవలపర్స్‌‌‌‌‌‌‌‌. అయితే, ఇప్పుడు పేషెంట్స్‌‌‌‌‌‌‌‌కు ట్రీట్మెంట్‌‌‌‌‌‌‌‌ ఎలా ఇవ్వాలో కూడా వర్చువల్ రియాలిటీలోనే ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు యుకె డాక్టర్స్‌‌‌‌‌‌‌‌.
చనిపోయిన వ్యక్తి శరీరంతోనో, ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ అవయవాలతోనో ట్రైనీ డాక్టర్స్‌‌‌‌‌‌‌‌కి ప్రాక్టికల్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తుంటారు. కానీ, యుకెలోని కేంబ్రిడ్జ్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ వాళ్ల ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ (నేషనల్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ సర్వీస్) ట్రస్ట్‌‌‌‌‌‌‌‌, లాస్‌‌‌‌‌‌‌‌ ఏంజెలెస్‌‌‌‌‌‌‌‌లోని గిగ్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే టెక్‌‌‌‌‌‌‌‌ కంపెనీ కలిసి ‘హోలోసినరియోస్‌‌‌‌‌‌‌‌’ అనే టెక్నాలజీని డెవలప్‌‌‌‌‌‌‌‌ చేశారు. మొదటగా అడెన్‌‌‌‌‌‌‌‌బ్రూక్స్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఈ టెక్నాలజీ వాడారు. 
‘‘ఇదెలాపనిచేస్తుందంటే... ముందుగానే హోలోగ్రఫిక్ పేషెంట్‌‌‌‌‌‌‌‌ను తయారుచేస్తారు. ట్రైనీ డాక్టర్‌‌‌‌‌‌‌‌ విఆర్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌సెట్ పెట్టుకొని  ఆ పేషెంట్‌‌‌‌‌‌‌‌ని కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌ అవుతాడు.‌‌‌‌‌‌‌‌ ఆ హోలోగ్రఫిక్ పేషెంట్‌‌‌‌‌‌‌‌కు అన్ని రకాల శరీరావయవాలు ఉంటాయి. మనిషిని ఎలా ట్రీట్‌‌‌‌‌‌‌‌ చేస్తారో  ఆ పేషెంట్‌‌‌‌‌‌‌‌ని కూడా అలానే ట్రీట్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. విఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకుని హోలోగ్రఫిక్ పేషెంట్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడొచ్చు. సమస్యలు అడిగి తెలుసుకోవచ్చు’’ అని ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ తయారుచేసిన సియు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌ అనస్థటిస్ట్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరుణ్‌‌‌‌‌‌‌‌ గుప్తా చెప్పాడు. వీళ్లు విడుదల చేసిన వీడియోలో హోలోగ్రఫిక్ ఆస్తమా పేషెంట్‌‌‌‌‌‌‌‌కి ట్రీట్మెంట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అందులో పేషెంట్‌‌‌‌‌‌‌‌, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి తన అనారోగ్య సమస్యల్ని చెప్తుంటుంది.