వీపీఎన్ యాప్స్ .. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!

వీపీఎన్ యాప్స్ .. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!

కూర్చున్న చోటు నుంచి కదలకుండా ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నామంటే అదంతా ఇంటర్నెట్ చొరవే. కానీ, అదే ఇంటర్నెట్లో యూజర్ కి సేఫ్టీ లేకుండా పోతోంది. అలాంటి టైంలో సేఫ్ బ్రౌజ్ అందించాయి వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ యాప్స్.  అలాగని ఫ్రీగా వస్తున్న యాప్ లన్ని ఇష్టమొచ్చినట్లు వాడుకుంటామంటే మాత్రం చిక్కుల్లో పడినట్లే!. ఇంతకీ ఈ ఫ్రీ యాప్స్ ను ఎలా వాడుకోవాలి?, డేంజర్ యాప్ లని ఎలా గుర్తుపట్టాలి?. వివరాలు…

ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఇంటర్నెట్ సేఫ్టీ అతిపెద్ద సమస్యగా మారింది.  అడ్వాన్స్డ్ టెక్నాలజీని సైతం అలవోకగా బ్రేక్ చేస్తున్నారు హ్యాకర్స్.  దీనికి తోడు ఓపెన్ వైఫై నెట్ వర్క్స్ వల్ల హ్యాకింగ్ ప్రాసెస్  ఇంకా ఈజీగా మారింది. అలాంటి టైంలో సేఫ్ బ్రౌజ్ కోసం వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) అందుబాటులోకి వచ్చింది.  ప్రైవసీ విషయంలో స్ట్రాంగ్ గా ఉండటంతో చాలామంది వీపీఎన్ యాప్స్ కి ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే ఈ మధ్య వీపీఎన్ యాప్స్ గురించి  రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ వీపీఎన్ యాప్స్ ని సేఫ్ గా ఎలా వాడుకోవాలంటే…

డెస్క్ టాప్, ల్యాపీ,  ట్యాబ్, స్మార్ట్ ఫోన్.. ఇలా ఏదైనా డివైజ్ లో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.  ఇందుకోసం నెట్ వర్క్ ఆపరేటర్స్ ఆ డివైజ్ యూజర్ కి ఒక నెంబర్ ఇస్తారు.  దానినే ఐపీ నెంబర్(ఇంటర్నెట్ ప్రొటోకాల్ నెంబర్) అంటారు. నెట్ వాడే టైంలో ఆ ఐపీ నెంబర్తో నే డివైజ్ కనెక్ట్ అవుతుంది. అలాంటి టైంలో ‘ఏ డివైజ్లో ఇంటర్నెట్ వాడుతున్నారు?, ఏ వెబ్సైట్ చూస్తున్నారు? లొకేషన్’.. ఇలాంటి ట్రాక్ వివరాలన్నీ ఇంకొకరు(హ్యాకర్ కూడా కావొచ్చు) చూడొచ్చు.  ఇలా కాకుండా ఐపీ అడ్రస్ ను ట్రేస్ చేయడానికి వీల్లేకుండా, బ్రౌజింగ్ సేఫ్గా చేసుకునేందుకు వీపీఎన్ ఆప్షన్ని తీసుకొచ్చాయి థర్డ్ పార్టీలు. ఇందుకోసం సర్వీస్ ప్రొవైడర్స్  ఎక్స్ట్రా హబ్లను ఏర్పాటు చేస్తాయి. ఇవి ఐపీని హైడ్ చేసి ఇంటర్నెట్ రిక్వెస్ట్ను ప్రాసెస్ చేస్తాయి.  అప్పుడు బ్రౌజింగ్లో ఉన్న యూజర్ ఐపీ అడ్రస్ ఎవరికీ తెలియదు. సెపరేట్ ఐపీ అడ్రస్తో ఇంటర్నెట్ బ్రౌజింగ్ అవుతుంది.  ఈ ప్రాసెస్లో యూజర్ డేటా మొత్తం ఎన్క్రిప్ట్ అవుతుంది(ప్రైవేట్ బ్రౌజింగ్లో ఎన్క్రిప్ట్ కాదు).  అంటే..  ఈ సర్వీస్లో డేటా హ్యాకర్లు, ఇతరుల చేతికి చిక్కకుండా సేఫ్గా ఉంటుందన్నమాట.  ‘ఆన్లైన్ యూజర్ ప్రైవసీ, డేటా సేఫ్టీ’.. వీపీఎన్ సర్వీస్ వల్ల  ప్రధానంగా జరిగే రెండు లాభాలు ఇవే. ఆప్షనల్ బ్రౌజర్ సెట్టింగ్ కావడంతో కుకీస్ని థర్డ్ పార్టీ సర్వర్కి ట్రాన్స్ఫర్ చెయ్యదు.

అసలు ఎందుకంటే..

పబ్లిక్ వైఫై ప్లేసుల్లో, కొన్ని కంపెనీలు తమ బ్రాంచ్ల మధ్య కమ్యూనికేషన్ కోసం వీపీఎన్ యాప్స్ని ఉపయోగిస్తున్నాయి. అంతేకాదు పర్సనల్గా కూడా కొందరు ఈ యాప్స్ని వాడుతున్నారు. వీటి ప్రత్యేకత ఏంటంటే.. తక్కువ సెక్యూరిటీ ఉన్న నెట్వర్క్లో కూడా ఎన్క్రిప్టెడ్(సేఫ్ డేటా) కనెక్షన్ని అందించే కెపాసిటీ ఉండటం.    కానీ, వీపీఎన్ యాప్స్ మెయిన్ కాన్సెప్ట్ ‘ప్రైవసీ–సేఫ్ డేటా’ ఎంత మాత్రం కాదు.  బ్లాక్ చేసిన వెబ్ సైట్లను ఓపెన్ చేసేందుకు వీపీఎన్ యాప్స్ని థర్డ్ పార్టీలు(సర్వీస్ ప్రొవైడర్లు) డెవలప్ చేస్తుంటాయి.

ఉదాహరణకు ఒక వెబ్సైట్ని మన ఏరియాలో బ్యాన్ చేశారు.  అదే వెబ్సైట్ బ్రెజిల్లో పని చేస్తుంది.  అప్పుడు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ యాప్ ద్వారా బ్రెజిల్ సర్వర్కి ఇక్కడి డివైజ్ కనెక్ట్ అవుతుంది.  అక్కడి హబ్ క్లియరెన్స్ ఇస్తే  ఆ వెబ్సైట్ను ఓపెన్ చేసి చూడొచ్చు.  ఇదంతా వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది.  మన దేశంలో లైవ్ స్ట్రీమింగ్ యాప్స్, పోర్న్ వెబ్ సైట్లను చూసేందుకు చాలా మంది వీపీఎన్ యాప్స్ని ఉపయోగిస్తున్నారు. అప్పుడప్పుడు వేరే దేశాల సర్వర్ పరిధిలోని యూట్యూబ్లో కొత్త సినిమాలు అప్లోడ్ అవుతుంటాయి.  వీపీఎన్ యాప్ల ద్వారా ఆ సినిమాల్ని చూసేందుకు వీలు ఉంటుంది.  ఈ కారణంతోనే మన దగ్గర వీపీఎన్ యాప్స్ వాడేవాళ్ల సంఖ్య పెరిగిపోతోంది.

లీగల్?.. ఇల్లీగల్?

ఐసోలెటెడ్ నెట్వర్క్, ప్రైవేట్ బ్రౌజింగ్ కి  వీపీఎన్ యాప్స్ పనితీరుతో అస్సలు సంబంధం ఉండదు.  పక్కా సెక్యూర్ యాక్సెస్ తో పని చేస్తాయివి.  రిస్ట్రిక్టెడ్ వెబ్సైట్స్, బ్యాన్డ్ వెబ్సైట్స్.. వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్స్ కి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అక్కడి ప్రజలు వీటిని ఉపయోగించడం వల్ల యాడ్స్ రూపంలో ప్రొవైడర్స్కి ఆదాయం వస్తోంది.  అయితే ఈ వ్యవహారం అంతా లీగల్గా జరుగుతోందా? అంటే కాదనే చెప్పాలి.  అలాగని ఈ టెక్నికల్ ప్రాసెస్ని ఇల్లీగల్ అని చెప్పడానికి వీల్లేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.  కొన్ని దేశాలు మాత్రం  వీపీఎన్ యాప్స్ని కంప్లీట్గా బ్యాన్ చేశాయి. మరికొన్ని దేశాలు కొన్ని రూల్స్ పెట్టి వాడుకునేందుకు పర్మిషన్లు ఇచ్చాయి. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ లు (వీపీఎన్)లను అడ్డుకోవడం కోసం పదికి పైగా దేశాలు సెన్సార్ షిప్ ను విధించాయి. అయినా కూడా ‘సేఫ్ ప్రోగ్రామింగ్’ పేరుతో వీపీఎన్ యాప్స్ ఇప్పటికీ వాడకంలో ఉన్నాయి.

ఫ్రీతో వచ్చే లాభమేంటి?

వీపీఎన్ వెబ్సైట్/యాప్స్.. మూడు రకాలుగా సేవలు అందిస్తున్నాయి. పూర్తిగా ఫ్రీ, మినిమమ్ పేమెంట్, మ్యాగ్జిమమ్ పేమెంట్తో సబ్స్క్రిప్షన్కి అవకాశం కల్పిస్తాయి. మొదట్లో కొన్నాళ్లపాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇచ్చి.. ఆ తర్వాత ప్యాక్స్ ఆఫర్లు ప్రకటిస్తారు కొందరు ప్రొవైడర్లు.  మరికొందరు ప్రొవైడర్స్ లిమిటెడ్ డేటాతో ఫ్రీ ప్యాక్స్ ఇస్తుంటారు.  ఓవరాల్గా చూసుకంటే  ఫ్రీ వీపీఎన్ యాప్స్ ఎక్కువగా ఉన్నాయి.  యాడ్స్ రూపంలో వీటికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అయితే ఫ్రీ కేటగిరీలో చాలా యాప్స్ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా బయటకొచ్చాయి.  వీపీఎన్ యాప్స్ ప్రస్తుతం  ‘డార్క్ వరల్డ్’కి ఇన్కమ్ సోర్స్గా మారింది. బ్లాక్డ్ సైట్లను ఎలా ఓపెన్ చేయాలో యూజర్లకు ట్రిక్స్, టిప్స్ ఇస్తూ ‘వీపీఎన్స్ రూల్స్’ని బ్రేక్ చేస్తున్నాయి. మరికొన్ని యాడ్ ఫ్రాడ్లకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నింటిని ప్లేస్టోర్ నుంచి పూర్తిగా తొలగించేశారు కూడా.  డేటా కలెక్ట్ చేసినట్లు కొన్ని యాప్ల మీద ఆరోపణలు వచ్చినా.. అవి ఉత్తదేనని తేలింది.

ఇయి చూస్కొని వాడాలె

వీపీఎన్ అనేది వెబ్ వరల్డ్లో  స్వేచ్ఛగా, ధైర్యంగా విహరించేందుకు నెటిజన్కి దొరికిన ఒక అవకాశం. అందుకే టెక్ ఎక్స్పర్ట్స్ కూడా వీటిని రికమండ్ చేస్తుంటారు. అలాగని ఎడాపెడా ఈ యాప్స్ని వాడితే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.  వీపీఎన్ యాప్స్, మరీ ముఖ్యంగా ఫ్రీ యాప్స్ని ఉపయోగించేటప్పుడు  కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

  • పబ్లిక్ ప్లేసుల్లో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని ఉపయోగించడం అంత మంచిది కాదు.  హ్యాకర్లు వాటిని ఎరగా ఉపయోగించుకుంటారు. ఒకవేళ ఫ్రీ వైఫై కంపల్సరీగా ఉపయోగించాల్సి వస్తే వీపీఎన్ యాప్స్ సాయం తీసుకోవాలి.
  • వీపీఎన్ యాప్స్ ఉపయోగాల్లో సేఫ్టీ ఒకటి. అంతేగానీ సేఫ్టీ కోసమే వీటిని తయారు చేయడం లేదు.
  • రకరకాల కారణాలతో వీపీఎన్ యాప్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. ఇంటర్నెట్ స్పీడ్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మీద బ్రౌజింగ్ ఆధారపడి ఉంటుంది.
  •  వీపీఎన్ యాప్స్  వాడేముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫేక్ యాప్స్ వాడటం వల్ల ‘డేటాపై కంట్రోల్ కోల్పోయే’ హయ్యర్ రిస్క్ ఉంటుంది.  సర్వర్స్ నుంచి డేటాను హ్యాక్ చేసే చాన్స్ ఉంది.  అందుకే యాప్స్ ఉపయోగించే ముందు దాని హిస్టరీని, బ్యాక్ గ్రౌండ్ని పరిశీలిస్తే మంచిది.
  •  ఎక్కువ పేమెంట్ ఉన్న వీపీఎన్ యాప్స్.. కచ్చితమనే గ్యారెంటీ లేదు.  తక్కువ పేమెంట్ ఉన్న యాప్లు కూడా ఎక్కువ ప్రొటెక్షన్ని అందిస్తున్నాయి.  ఇవి ఫ్రీ యాప్లతో పోలిస్తే ఎక్కువ సాప్ట్వేర్ అప్డేట్స్ ఇస్తున్నాయి. కాబట్టి మినిమమ్ పేమెంట్ యాప్స్ని ట్రై చేయడం బెటర్.
  • వీపీఎన్ యాప్ల ప్రైమరీ డ్యూటీ హ్యాకర్స్ నుంచి యూజర్ డేటాను రక్షించడం. ఈ సెక్యూరిటీ కోసం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేస్తుంటాయి కొన్ని యాప్స్. అదే టైంలో ఇంకొన్ని యాప్స్.. మాల్వేర్(వైరస్)ని స్ప్రెడ్ చేస్తుంటాయి. ఒకరకంగా చూసుకుంటే ఆన్లైన్ సెక్యూరిటీలో ఇది పెద్ద రిస్కే.
  • ఒక స్టడీ ప్రకారం.. సుమారు 300 వీపీఎన్ యాప్స్ మాల్వేర్ మీదే రన్ అవుతున్నాయట. అదే విధంగా మరో 72 శాతం ఫ్రీ వీపీఎన్ యాప్స్, తమ సాఫ్ట్వేర్లో  థర్డ్ పార్టీ ట్రాకర్ని కలిగి ఉన్నాయట. అంటే అవి ప్రైవసీ, డేటా సేఫ్టీ విషయంలో పక్కాగా లేవు.  అంతే కాదు నెట్ఫ్లిక్స్ లాంటి వాటిని ఫ్రీ వీపీఎన్ యాప్స్ అంత ఈజీగా అన్ బ్లాక్ చేయలేవు. ఒకవేళ చేసిందంటే ఆ యాప్ అంత సేఫ్ కాదని అర్థం.