ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన వెర్ట్యూసా 

ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన వెర్ట్యూసా 

హైదరాబాద్: డిజిటల్ స్ట్రాటజీ, డిజిటల్ ఇంజనీరింగ్, ఐటి సేవలు మరియు పరిష్కారాలను అంతర్జాతీయంగా అందించే సంస్థ వెర్ట్యూసా తమ హైదరాబాద్ క్యాంపస్‌లో మంగళవారం కొవిడ్-19 కేర్ ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. దేశంలోని తమ ప్రధాన కార్యాలయ ప్రాంగణాలన్నింటిలోనూ ఇదే విధమైన కేంద్రాలను ప్రారంభించే ప్రక్రియలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. తమ టీమ్ సభ్యుల కోసం ఒక కొవిడ్ కేర్ పోర్టల్‌ను వెర్ట్యూసా ప్రారంభించింది. ఈ ఐసోలేషన్ కేంద్రంలో 30 పడకలు, స్నాన సౌకర్యాలు, వాష్ రూమ్స్ ఉన్నాయి, అడ్మిట్ అయిన వారి కోసం రోజుకు 3 పూటలా పౌష్టిక ఆహారం, భోజనాలు, పోషక పానీయాలు అందజేస్తారు. రెనోవా ఆసుపత్రికి చెందిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఈ కేంద్రంలో ఉండి చికిత్స అందిస్తారని, దీన్ని ఒక వైద్య అధికారి పర్యవేక్షిస్తారని సంస్థ ప్రకటించింది. కేంద్రంలో ఉండే సిబ్బందిలో ప్రతి ఒక్కరికీ పిపిఇ కిట్లు, ప్రభుత్వం నిర్దేశించిన ఇతర భధ్రతా సౌకర్యాలన్నీ తప్పనిసరి. ఈ కేంద్రం ప్రాథమికంగా వెర్ట్యూసా టీమ్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులతోపాటు వినియోగదారులకు సైతం సేవలు అందిస్తుందని చీఫ్ పీపుల్ ఆఫీసర్ జి.సుందర్ నారాయణన్ వెల్లడించారు. ఈ కష్టమైన కాలంలో ప్రతి ఒక్కరు సవాలును ఎదుర్కోవడానికి ముందుకు రావడం ప్రధానం” అని అన్నారు. వినియోగదారుల కేంద్రతకు భంగం కలగకుండానే ఈ చర్యలన్నీ చేపడుతోందని స్పష్టం చేశారు.