
‘విరూపాక్ష’ చిత్ర దర్శకుడు కార్తీక్ దండు ఎంగేజ్‌మెంట్ ఆదివారం జరిగింది. హర్షిత అనే అమ్మాయితో తన నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నాగచైతన్య, శోభిత దంపతులతో పాటు హీరో సాయి దుర్గ తేజ్, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తదితరులు హాజరై కాబోయే వధూవరులకు కంగ్రాట్స్ చెప్పారు.
వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కార్తీక్ దండు ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.