విశాక ఇండస్ట్రీస్ జూన్ క్వార్టర్ లాభం38.52 కోట్లు

విశాక ఇండస్ట్రీస్ జూన్ క్వార్టర్ లాభం38.52 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: వీనెక్స్ట్​ పేరుతో ఫైబర్​సిమెంట్​ బోర్డులను తయారు చేసే హైదరాబాద్​ కంపెనీ విశాక ఇండస్ట్రీస్ ​పశ్చిమ బెంగాల్​మిడ్నాపూర్​ జిల్లాలోని ప్లాంటు కెపాసిటీని పెంచాలని నిర్ణయించింది. ఈ ప్రపోజల్​కు కంపెనీ  డైరెక్టర్ల  బోర్డు ఆమోదం తెలిపింది. పెరుగుతున్న డిమాండ్​ను తీర్చడానికి ఇక్కడ కొత్తగా 72 వేల టన్నుల కెపాసిటీ గల ప్లాంటును నిర్మిస్తారు. రూ.120 కోట్ల ఖర్చుతో చేపట్టే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏడాదిలో పూర్తవుతుంది.  

ప్రస్తుత ప్లాంటు కెపాసిటీ 2.20 లక్షల టన్నులు. ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్​లో కంపెనీకి రూ.38.52 కోట్ల లాభం (కన్సాలిడేటెడ్​) వచ్చింది. పోయిన ఏడాది జూన్​ క్వార్టర్​లో రూ.54.72 కోట్లు వచ్చాయి. ఆదాయం రూ. 482 కోట్లుగా రికార్డయింది.  2021 మొదటి క్వార్టర్​లో  రూ.351 కోట్ల ఆదాయం వచ్చింది.బిల్డింగ్ ప్రొడక్టుల నుంచి రూ. 39.08 కోట్లు,  సింథటిక్ బైండెడ్ నూలు నుంచి రూ.8.8 కోట్లు వచ్చాయి.  

ఏడాది కాలానికి ఈపీఎస్​ రూ.23.95 నుంచి రూ.22.29 లకు తగ్గింది. కంపెనీ ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో సిమెంట్​రూఫింగ్​ షీట్స్​ తయారీ కోసం అదనపు ప్రొడక్షన్​ లైన్​ను ఈ ఏడాది మే నెలలో మొదలుపెట్టింది. దీని కెపాసిటీ లక్ష టన్నులని జాయింట్​ మేనేజింగ్‌ ​డైరెక్టర్​గడ్డం వంశీ చెప్పారు. 1981లో డాక్టర్ గడ్డం వివేకానంద్​ స్థాపించిన విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రస్తుతం  సిమెంట్ షీట్‌‌‌‌లు,  ఫైబర్ సిమెంట్ బోర్డులు, హైబ్రిడ్ సోలార్ రూఫ్‌‌లు, ఫైబర్ నూలు వంటి చాలా ప్రొడక్టులను తయారు చేస్తుంది. వీటిలో మెజారిటీ ప్రొడక్టులు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. దేశమంతటా12 తయారీ యూనిట్లు, 13 మార్కెటింగ్ ఆఫీసులు,  7000 పైగా డీలర్ అవుట్‌‌లెట్లు, పాన్ ఇండియా డిస్ట్రిబ్యూషన్​ ఛానెల్‌‌తో  విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్   గ్రీన్‌‌ప్రో సర్టిఫైడ్ సంస్థగా అవతరించింది.