విశాఖలో ప్రేమోన్మాది దాడి జరిగిన విషయం తెలిసిందే. వరంగల్‌కు చెందిన హర్షవర్ధన్ వైజాగ్ లాడ్జిలో యువతిపై పెట్రోల్‌తో దాడి చేసి నిప్పంటించాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.తన ఒంటిపై కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో హర్షవర్ధన్ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించాడు.ఈ నెల 13న యువతిని మాట్లాడుకుందామని స్థానిక.. శ్రీ రాఘవేంద్ర లాడ్జికి పిలిచాడు. ఈ క్రమంలో.. ఆమెపై హర్షవర్ధన్ పెట్రోల్‌తో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో యువతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాధితులిద్దరిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.
హన్మకొండకు చెందిన యువకుడు హర్షవర్ధన్ రెడ్డి, విశాఖకు చెందిన సదరు యువతి పంజాబ్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఈ క్రమంలో వీరి మధ్య గొడవకు ప్రేమ వ్యవహరమే కారణమని తెలుస్తోంది. ఇప్పటికే హర్షవర్ధన్‌పై 307, 309, 356ఏ, 354డీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
