
విశాఖపట్నం మధురవాడ, నగరం పాలెం రోడ్డులో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో విద్యార్థులకు గాయాలయ్యాయి. మధురవాడ నుంచి నగరం పాలెం వైపు వస్తున్న ఆటోకు పంది అడ్డురావడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడిందని స్థానికులు తెలిపారు.
ప్రమాదం సమయంలో ఆటోలో ఏడుగురు విద్యార్థులు ఉన్నారని.. వారందరికీ స్పల్పంగా గాయాలయ్యాయని చెప్పారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ALSO READ : కంపెనీ మటాష్ : ఇదో దరిద్రమైన ఆటో.. ఎవరూ కొనొద్దు