నామినేషన్లకు మిగిలింది ఒక్క రోజే: బీఆర్ఎస్ నుంచి విష్ణువర్దన్ రెడ్డి కూడా నామినేషన్

నామినేషన్లకు మిగిలింది ఒక్క రోజే: బీఆర్ఎస్ నుంచి విష్ణువర్దన్ రెడ్డి కూడా నామినేషన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లకు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఇయ్యాల ఆదివారం, సోమవారం దీపావళి సెలవు కావడంతో మంగళవారం మాత్రమే మిగిలింది. శనివారం 31 మంది 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. షేక్​పేట ఆఫీస్​లో ఆర్వో సాయిరాం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు.

బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత మూడో సెట్, తెలంగాణ రక్షణ సమితి నుంచి మంజుష రెండో సెట్, బీఆర్ఎస్ నుంచే పి.విష్ణువర్దన్ రెడ్డి (పీజేఆర్ కొడుకు) రెండు సెట్లు, బీజేపీ నుంచి హరిత రెడ్డి (లంకల దీపక్ భార్య) ఒక సెట్ వేశారు. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నుంచి చైర్మన్ బేర బాలకిషన్ నామినేషన్ వేశారు. మిగతా వారు వివిధ పార్టీలు, స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. ఇప్పటివరకు మొత్తం94 మంది నుంచి 127 సెట్లు దాఖలయ్యాయి.