గెలిపిస్తే ఉప్పల్​ను అభివృద్ధి చేస్త : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

గెలిపిస్తే ఉప్పల్​ను అభివృద్ధి చేస్త : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఉప్పల్, వెలుగు : తనను గెలిపిస్తే ఉప్పల్ సెగ్మెంట్​లో ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం స్వరూపనగర్​లో ఉన్న కరిగిరి వేంకటశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిలుకానగర్ చౌరస్తాలోని స్వామి వివేకానంద విగ్రహాన్ని, పరిసరాలను శుభ్రం చేశారు. వివేకానంద విగ్రహానికి పూలమాల వేశారు.

తర్వాత చిలుకానగర్​లో పాదయాత్ర చేపట్టారు. వేలాది మంది అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట తరలివచ్చారు. వివిధ కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటును అమ్ముకోవద్దని కోరారు. అభివృద్ధి జరగాలంటే కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలన్నారు..