ఊహించని మలుపులతో సాగే కథ

 ఊహించని మలుపులతో సాగే కథ

బాలనటుడిగా ఆకట్టుకుని హీరోగా మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు విశ్వ కార్తికేయ. అతను హీరోగా ఆనంద్ కొలగాని దర్శకత్వంలో రాజు గుడిగుంట్ల నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్త్ అవర్’. రిషికా కపూర్ హీరోయిన్. నిన్న రామానాయుడు స్టూడియోస్‌‌‌‌‌‌‌‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాతలు కె.ఎస్.రామారావు, ఏ.ఎం రత్నం,  అచ్చిరెడ్డి,  దామోదర్ ప్రసాద్ , బెక్కెం వేణుగోపాల్, ప్రసన్న కుమార్, డి.యస్. రావు  ముఖ్య అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘కొత్త తరహా కథతో సాగే యాక్షన్ అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌ థ్రిల్లర్ ఇది. ఊహించని మలుపులతో సాగే కథ కావడంతో ఈ టైటిల్ పెట్టాం. వచ్చే నెల 6 నుంచి షూటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించబోతున్నాం’ అని చెప్పాడు. ఇలాంటి అడ్వెంచరస్  సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌ చెప్పాడు విశ్వ కార్తికేయ. ఈ చిత్రంతో టాలీవుడ్‌‌‌‌‌‌‌‌కు పరిచయమవడం హ్యాపీ అంది రిషికా. ‘టైటిల్ ఎంత డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ఉందో సినిమా కూడా అంతే డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. కచ్చితంగా నచ్చుతుంది’ అన్నారు నిర్మాత. అర్జున్ అంబటి, భద్రం, కిర్రాక్ సీత, వాసు ఇంటూరి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.