సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి : విశ్వహిందూ పరిషత్

సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి : విశ్వహిందూ పరిషత్

హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విశ్వహిందూ పరిషత్ ఎన్నికల సంఘానికి కంప్లయింట్ చేసింది. ఇటీవల తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్​ పార్టీ బహిరంగ సభలో అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షింతలను సీఎం రేవంత్ రెడ్డి అవమానపర్చేలా మాట్లాడరని విశ్వహిందూ పరిషత్ ఈసీకి కంప్లయింట్ చేసింది. ఈ మేరకు గురువారం బీఆర్కే భవన్​లో సీఈఓ వికాస్​రాజ్​ను కలిసి విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

విశ్వహిందూ పరిషత్ వాళ్లు పంచిన అక్షింతలు అయోధ్య నుంచి వచ్చినవి కాదని.. అవి కంట్రోల్ బియ్యంతో తయారుచేసి పంచారు" అనడాన్ని తప్పు పట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఓటు బ్యాంకు రాజకీయాలకు సీఎం రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విచక్షణ కోల్పోయి హిందుత్వాన్ని దూషిస్తున్నారని వివరించారు. హిందూ దేవుళ్లను దూషించే నేతలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.