విశ్వక్ సేన్ ఫన్ అండ్ ఫంకీ టీజర్ రిలీజ్..

విశ్వక్ సేన్ ఫన్ అండ్ ఫంకీ టీజర్ రిలీజ్..

విశ్వక్ సేన్ హీరోగా ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం  ‘ఫంకీ’. కయాదు లోహర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.   శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో  విశ్వక్ సేన్ డైరెక్టర్ రోల్‌‌‌‌లో కనిపిస్తూ కామెడీ పంచ్‌‌‌‌లు వేయడం ఫన్నీగా ఉంటుంది. డిఫరెంట్ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. 

కయాదు లోహర్ తనదైన గ్లామర్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంది. నరేష్, రఘుబాబు, పమ్మి సాయి, సంపత్ రాజ్, మురళీధర్ గౌడ్ ఇతర పాత్రల్లో కనిపించి హాస్యం పంచారు.  అనుదీప్ మార్క్ కామెడీతో హిలేరియస్‌‌‌‌గా సాగిన ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే మరిన్ని అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తోపాటు సినిమా రిలీజ్ డేట్‌‌‌‌ను దర్శక నిర్మాతలు  ప్రకటించనున్నారు.