విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్.. నవ్వుతూ నరాలు లాగే మాస్

విశ్వక్ సేన్  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి  గ్లింప్స్.. నవ్వుతూ నరాలు లాగే మాస్

రైటర్.. డైరెక్టర్..హీరో.. విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs of Godavari). ఈ మూవీ నుంచి అద్దిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ఎంట్రీ కిరాక్ డైలాగ్ తో స్టార్ట్ అయింది..అన్న..మేం గోదారోళ్లం..మాటోకటే సాగదీస్తాం..తేడాలోస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం.. అంటూ విశ్వక్ సేన్ పవర్ఫుల్ రోల్ డైలాగ్ మూవీపై హైప్ పెంచుతోంది.

అంతే కాకుండా..ఈ గ్లింప్స్ లో రివిల్ అయిన క్యారెక్టర్స్ అన్నీ..చాలా సీరియస్ యాంగిల్ లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. డైలాగ్ కింగ్ సాయి కుమార్ కళ్ళల్లో ఇంటెన్సేవిటీ, గోపరాజు రమణ కోపం, ఊరి జనాలు పరిగెత్తడం ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ ను ఇంట్రెస్టింగ్ గా మలిచారు డైరెక్టర్ కృష్ణ చైతన్య(Krishna Chaitanya). ఇందులో హీరోయిన్ నేహా శెట్టి గొప్పింటి అమ్మాయిగా కనిపిస్తుండగా..అంజలి ఒక కీ రోల్ లో పోషిస్తుంది. 

సముద్రం ఒడ్డున నివసించే సాధారణ హీరో..ఊహించని స్థాయిలో పెద్ద నాయకులను ఎదిరించి..వారికి దీటుగా ఎలా నిలిచాడు అనేది ఈ మూవీలోని అసలు కథ అని తెలుస్తోంది. ఇంతవరకూ బాడీ లాంగ్వేజ్ పరంగా .. డైలాగ్ డెలివరీ పరంగా మాత్రమే మాస్ గా కనిపించిన విష్వక్, ఈ సినిమాలో మాస్ లుక్ తోనే కనిపిస్తున్నారు. 

డైరెక్టర్ కృష్ణ చైతన్య లిరిక్ రైటర్ గా సినిమా కెరీర్ ను స్టార్ట్ చేసి రౌడీ ఫెలో,చల్ మోహన్ రంగా వంటి మూవీస్ తో డైరెక్టర్ గా తనలోని టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో తనలోని వర్శతలిటీని చూపించబోతున్నారు. హీరో విశ్వ క్ సేన్ రీసెంట్ మూవీ దాస్ కా దామ్కి మూవీతో సక్సెస్ అందుకున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీకర స్టూడియోస్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించనున్నారు.