ఓటీటీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు విశ్వక్ సేన్

ఓటీటీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు విశ్వక్ సేన్

హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, ఓటీటీ షో ద్వారానూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వక్ సేన్. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్ ‘ఆహా’లో  రానున్న ‘ఫ్యామిలీ ధమాకా’ షోకు హోస్ట్‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు. సెప్టెంబర్ 8 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంట‌‌‌‌ల‌‌‌‌కు ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ రానుందని మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ఫ్యామిలీ షోకు హోస్ట్‌‌‌‌గా చేయడం థ్రిల్లింగ్‌‌‌‌గా ఉంది. 

ఈ షో ద్వారా ఎన్నో కుటుంబాలను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌ను ప్రేక్షకుల‌‌‌‌కు అందించ‌‌‌‌టానికి నేను ఎంతో ఆస‌‌‌‌క్తిగా ఎదురు చూస్తున్నా’ అన్నాడు. ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని, ఫ్రిమాంట‌‌‌‌ల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆరాధ‌‌‌‌న బోలా పాల్గొన్నారు.