
ఇటీవల ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లాంటి మాస్ ఎంటర్‌టైనర్‌లో కనిపించిన విశ్వక్ సేన్.. నెక్స్ట్ మూవీలో డిఫరెంట్ గెటప్‌తో సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. ‘లైలా’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో తను లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రామ్ నారాయణ్ దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో బుధవారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్‌ని ఇచ్చారు. హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేయగా.. నిర్మాతలు వెంకట సతీష్ కిలారు, జెమినీ కిరణ్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. అలాగే ‘లైలా’ ఐ లుక్ పేరుతో లేడీ గెటప్‌లో విశ్వక్ కళ్లు మాత్రమే కనిపించేలా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆకాంక్ష శర్మ ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. రిచర్డ్ ప్రసాద్ డీవోపీ కాగా తనిష్క్ బాగ్చి, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.