పొలిటికల్ యాక్షన్ డ్రామా షురూ

పొలిటికల్ యాక్షన్ డ్రామా షురూ

డిఫరెంట్ స్ర్కిప్ట్‌‌‌‌‌‌‌‌లను సెలెక్ట్ చేసుకుంటూ  బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు విశ్వక్ సేన్.   తాజాగా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు.   శ్రీధర్ గంటా దర్శకత్వంలో ‘దసరా’ ఫేమ్ సుధాకర్ చెరుకూరి  నిర్మిస్తున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో  ఈ చిత్రాన్ని ప్రారంభించారు. దర్శకులు వశిష్ట ముహూర్తం షాట్‌‌‌‌‌‌‌‌కు క్లాప్ కొట్టగా, శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశాడు.  నిర్మాతలు నాగ వంశీ, సాహు గారపాటి స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌ని మేకర్స్‌‌‌‌‌‌‌‌కి అందజేశారు. 

విశ్వక్‌‌‌‌‌‌‌‌కి ఇది 13వ  చిత్రం.  విలేజ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగే యూనిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా అని, ఇందులో  విశ్వక్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడని దర్శక నిర్మాతలు చెప్పారు.  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుందని తెలియజేశారు.  కన్నడ నటి సంపద హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది.  ‘తంగలాన్’ ఫేమ్ కిషోర్ కుమార్ డీవోపీగా వ్యవహరిస్తుండగా ‘కాంతార’  ఫేమ్ అజనీష్ లోక్‌‌‌‌‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.