బ్యాగ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు..విశ్వక్‌సేన్ సంచలన ట్వీట్

బ్యాగ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు..విశ్వక్‌సేన్ సంచలన ట్వీట్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మరోసారి ఫైర్ అయ్యాడు. తన కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల తేదీని ఉద్దేశిస్తూ ట్విట్టర్ లో  ఓ రేంజ్లో తిట్ల వర్షం కురిపించాడు. వారసత్వం, బ్యాగ్రౌండ్ వంటి పదాలు ఉపయోగిస్తూ విశ్వక్ సేన్ ట్విట్టర్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. 

విశ్వక్ సేన్ ఏమన్నాండంటే..

విశ్వక్ సేన్  లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాను డిసెంబర్ 8వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు.  కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి విశ్వక్ సేన్ చేసిన పోస్ట్ నిదర్శనంగా కనిపిస్తోంది. 

బ్యాగ్రౌండ్ లేకపోతే..

మనకు బ్యాగ్రౌండ్ లేకపోతే ప్రతీ ఒక్కడు మన గేమ్ మారుద్దామని అనుకుంటాడు. ఒక వేళ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కానీ డిసెంబర్ 8వ తేదీన విడుదల అవ్వలేదు అంటే..మరో తేదీకి కానీ మారితే నన్ను ఈ మూవీ ప్రమోషన్స్ లో చూడరు..అంటూ సంచలన పోస్ట్ పెట్టాడు. 

ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ, అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ నటించిన తాజా మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఈ మూవీలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. అయితే ముందు అనుకున్న  దాని ప్రకారం..సినిమా డిసెంబర్ 8వ తేదీన విడుదల అవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ విడుదల డిసెంబర్ 29వ తేదీకి వాయిదా పడినట్లు తెలుస్తోంది. 

వారిని ఉద్దేశించి పెట్టాడా..?

డిసెంబర్ 7,8వ తేదీల్లో నితిన్, నాని, వరుణ్ తేజ్ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాల వల్లే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.