‘‘గోపీచంద్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. తనను దృష్టిలో ఉంచుకునే ఈ స్టోరీ రెడీ చేశా. కథ నచ్చి షూటింగ్ స్టార్ట్ చేద్దామన్నాడు. కానీ నా స్టైల్‌లో స్క్రిప్ట్ రెడీ చేయడానికి ఎనిమిది నెలలు టైమ్ తీసుకున్నా. గోపీచంద్ మార్క్ యాక్షన్‌తోపాటు నా మార్క్ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇందులో ఉంటాయి. కథ ప్రకారమే పెట్టాం. విశ్వంలో చాలా రహస్యాలు ఉంటాయి. ఇందులోని హీరో పాత్రలోనూ చాలా విషయాలు ఉంటాయి. ఇదొక ఎమోషనల్ యాక్షన్ సినిమా.
ఓ బర్నింగ్ ఇష్యూని తీసుకుని దాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం. గోపీచంద్ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. కథ ప్రకారం సాగే యాక్షన్ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయి. ‘వెంకీ’ తరహాలో ఇందులోనూ ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ముప్ఫై నిమిషాల పాటు వెన్నెల కిశోర్, వీటీ గణేష్, నరేష్, కవిత, చమక్ చంద్ర, షకలక శంకర్‌లతో ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్ కూడా ఉండేలా రూపొందించాం. గోపీ మోహన్‌తో పాటు భాను, నందు అనే రచయితలు దీనికి పనిచేశారు. ఫ్రెష్ థీమ్‌తో సాగే సీన్స్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’.
దర్శకుడిగా కొంత గ్యాప్ తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల రూపొందించిన చిత్రం ‘విశ్వం’. టీజీ విశ్వ ప్రసాద్, దోనేపూడి చక్రపాణి నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల చెప్పిన విశేషాలు.