కేన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విశ్వంభర బుక్ లాంచ్

కేన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విశ్వంభర బుక్ లాంచ్

చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి రూపొందిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌‌  కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ ప్రాజెక్టును నిర్మాత విక్రమ్ రెడ్డి ఇంటర్నేషనల్ లెవల్‌‌కి తీసుకెళ్లారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో  విశ్వంభర ఎక్స్‌‌క్లూజివ్ బుక్‌‌ను లాంచ్ చేశారు.

 ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌‌లో ఆయన సినిమా కథ, భారతీయ పురాణాల ప్రాధాన్యత, బుక్ విశేషాలు గురించి వివరించారు. అలాగే సినిమా స్థాయి, వీఎఫ్‌‌ఎక్స్ స్టూడియోల సహకారం గురించి కూడా చెప్పారు.  సోషియో ఫాంటసీ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన  ఫస్ట్ గ్లింప్స్, సాంగ్  ఇతర ప్రమోషనల్ కంటెంట్‌‌కు  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రానికి సంబంధించిన  పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్‌‌ఎక్స్ పనులు ఇప్పటికే తొంభై శాతం  పూర్తయ్యాయని, త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేస్తామని అన్నారు. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కునాల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.