ఇవాళ్టి(అక్టోబర్1) నుంచి లేక్​ ఫ్రంట్ పార్కులో సందర్శకులకు అనుమతి

ఇవాళ్టి(అక్టోబర్1)  నుంచి లేక్​ ఫ్రంట్ పార్కులో సందర్శకులకు అనుమతి

హైదరాబాద్, వెలుగు: సిటిజన్లకు సరికొత్త అనుభూతిని పంచేందుకు మరో పార్కును హెచ్ఎండీఏ సిద్ధం చేసింది. హుస్సేన్ సాగర్ ఒడ్డున జలవిహార్ పక్కన తీర్చిదిద్దిన లేక్ ఫ్రంట్ పార్క్​ఆదివారం నుంచి సందర్శకులను అందుబాటులోకి రానున్నది. రూ.26 కోట్ల 65 లక్షలతో ప్రారంభమైన ఈ పార్కును గత మంగళవారం అధికారులు ప్రారంభించారు. 

ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ పార్కు ఓపెన్ లో ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు వాకర్స్​టైమింగ్స్​గా నిర్ణయించామన్నారు. ఈ పార్కులో వాకింగ్ చేయాలనుకునే వాకర్స్ నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుందన్నారు.   వందమందికి మించకుండా బర్త్ డే ఫంక్షన్లు, గెట్ టు గెదర్, ఇతర కల్చరల్ యాక్టివిటీస్ చేసుకునే అనుమతిని కల్పిస్తున్నామని.. అయితే, ఇందుకోసం రూ.11 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.