గద్వాల, వెలుగు: పది ఫలితాల్లో విశ్వ భారతి స్కూల్ కు చెందిన సంయుక్త, అభిజ్ఞ 600 మార్కులకు 586 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారని ప్రిన్సిపల్ తిరుమలేశ్, కరస్పాండెంట్ త్యాగరాజులు తెలిపారు. జితిద్రి 585, నందు శ్రీ, షమీల్, సాయి మోక్షిత 584, రోహిత్ కుమార్ 582 మనోజ్ఞ, జస్విత్ గౌడ్ 580 మార్కులు సాధించారు. మొత్తం 9 మంది స్టూడెంట్స్ 580 మార్కులు తెచ్చుకున్నారని అన్నారు.

