D విటమిన్ లోపం..ఆనారోగ్య సమస్యలు

D విటమిన్ లోపం..ఆనారోగ్య సమస్యలు

శరీరం ఆరోగ్యంగాఉండాలంటే దానికి కావాల్సిన పోషకాలు  తప్పనిసరిగా అందించాలి. అటువంటి పోషకాల్లో ముఖ్యైమనవి విటమిన్లు.. A,B, C, D, E, K, B1, B6, B12 ఇలా అనేక రకాల విటమిన్లు మన దైనందిన జీవితంలో చాలా అవసరం. వీటిని సరియైన మోతాదులో రోజు శరీరానికి అందిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. విటమిన్ లోపం ఉన్నట్లయితే శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. మన రోజూవారీ కార్యక్రమాలను చేయడం కష్టంగా మారుతుంది.శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ముఖ్యమైన విటమిన్లలో D లోపిస్తే ఏం జరుగుతుంది..? శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాలను తెలుసుకుందాం. 

D  విటమిన్ లోపిస్తే నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తుంది. బాగా చిరాకుగా ఉంటుంది. ఏ పని చేయడానికి శరీరం సహకరించదు.. శక్తిని కోల్పోయినట్లు అనిపిస్తుంది. చిన్న చిన్న పనులు కూడా  చేసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. వీటితో పాటు ఒళ్లు నొప్పులు బాధిస్తాయి. చర్మం పొడిబారడం, దురదగా అనిపించడం, విటమిన్ డి లోపం ఎక్కువగా ఉన్నవారిలో జుట్లు రాలి పోయే సమస్యలు తలెత్తుతాయి. 

విటమిన్ డి లోపం- అనారోగ్య సమస్యలు 

డి విటమిన్ లోపిస్తే.. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి క్షీణించిపోతుంది. ఫలితంగా జలుబు, దగ్గు,జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. డి విటమిన్ లోపం ఉన్న వారు పదే పదే ఆనారోగ్యం బారిన పడుతుంటారు.దీని వల్ల డిప్రెషన్ వంటి సమస్యలు కూడా వస్తాయి. నిద్రలేమికి డి విటమిన్ లోపం కూడా ఓ కారణం. 

విటమిన్ డి-ఆహారం 

డి విటమిన్ లోపం ఉన్నవారు రోజు తినే ఆహారంలో తప్పకుండా విటమిన్ డి పుష్కలంగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. సోయాబీన్,గుడ్లు, చీజ్, సీజనల్ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చేపల్లో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. 

క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. డి విటమిన్ పుష్కలంగా అందాలంటే మరో మార్గం పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు. మన శరీరంపై పడేలా చూసుకోవాలి. పిల్లలకు ఉదయిస్తున్న సూర్య కిరణాలు పడేలా చూసుకోవాలి. ప్రతి ఉదయం కొంతసేపు సూర్యకాంతిలో తిరగాలి.