మగాడివైతే మణిపూర్ ఫైల్స్ సినిమా తీయ్.. సాలిడ్ కౌంటర్ ఇచ్చిన వివేక్

మగాడివైతే మణిపూర్ ఫైల్స్ సినిమా తీయ్.. సాలిడ్ కౌంటర్ ఇచ్చిన వివేక్

మణిపూర్(Manipur) సంఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడి మహిళలపై జరిగిన అమానవీయ సంఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ గా మారింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఇక ఈ సంఘటనపై స్పందించారు ది కాశ్మీర్ ఫైల్స్(The kashmir files) దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri). 

"చివరకు ప్రతిసారీ మన అమాయక సోదరీమణులు, తల్లులు ఇలాంటి అమానవీయ చర్యలకు బలవుతున్నారు. ఒక భారతీయుడిగా, పురుషుడిగా, మనిషిగా నేను తల్లడిల్లిపోతున్నాను. చాలా గిల్టీగా ఫీలవుతున్నాను. ఓ మణిపూర్, నేను ప్రయత్నించాను.. కానీ విఫలమయ్యాను. ఇప్పుడు నేను చేయగలిగేది నా పనితో వారి విషాద కథలను ప్రజలకు తెలియజేయడమే. అప్పటికే చాలా ఆలస్యమైంది. నన్ను క్షమించండి'' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు వివేక్ అగ్నిహోత్రి. 

వివేక్ చేసిన ఈ ట్వీట్ పై ఒక నెటిజన్ స్పందిస్తూ.. సమయం వృధా చేసుకోకండి, నువ్వు మగాడివైతే 'మణిపూర్ ఫైల్స్' సినిమా తీసి చూపించు" అని ప్రశ్నించారు. ఇక ఈ ట్వీట్ పై స్పందించిన వివేక్.. "నాపై ఇంత నమ్మకం ఉంచినందుకు మీకు ధన్యవాదాలు. అన్నిటిపై నేనే చేస్తే ఎలా.. మీ టీమ్‌ ఇండియాలో చాలా మంది మగవాళ్లు ఉన్నారు కదా'' అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వివేక్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.