
ముషీరాబాద్, వెలుగు : చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన జి.వివేక్ వెంకటస్వామిని మాల మహానాడు టీమ్ ఘనంగా సత్కరించింది. హైదరాబాద్‌లోని వివేక్ నివాసంలో మాల మహానాడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీమ్ ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామిని శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ప్రతినిధులు నరసింహ, పవన్, సాయిచంద్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.