దళితులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించొచ్చు : వివేక్ వెంకటస్వామి

దళితులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించొచ్చు : వివేక్ వెంకటస్వామి

దళితులంతా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. జై భీమ్ సైనిక్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కలకోటి సత్యనారాయణను రాష్ట్రప్రభుత్వం ‘దళిత రత్న’ అవార్డ్ ఇవ్వటం గర్వకారణమన్నారు.

జై భీమ్ సైనిక్ ఫౌండేషన్ హెల్ప్ ఫర్ హెల్ప్ లెస్ ఆధ్వర్యంలో.. దళిత రత్న-2019 సన్మాన కార్యక్రమం.. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వివేక్ వెంకటస్వామి. దళిత రత్న అవార్డు గ్రహీత సత్యనారాయణ దళితుల అభివృద్ధికి కృషిచేస్తున్నారని కొనియాడారు.